తేనే
ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం . తేనే రోగనిరోధక శక్తిని పెంచడం తో పాటు అనేకరుగ్మతలను నివారించడం లో అమోఘంగా పనిచేస్తుంది . వారలు లో తేనే ఒకటి అందరికి తేనే సుపరిచితమే తీయదనం లో అన్నిటికంటే ముందుగా చెప్పేది తేనే తేనే రుచి లోనే కాదు ఆరోగ్యన్ని కాపాడటంలో కూడా ముందువరుసలో ఉంటుంది. గిరిజన ప్రాంతాల వారు తేనే ను సేకరించి కంపెనీ వాళ్లకు అమ్మడం వలన అవి బ్రాండెడ్ గా మారుస్తారు నిల్వ ఉండేలాగా చేస్తారు . కొంతమంది తేనే తీగలను పెట్టెలు పెట్టి పెంచి వాటిని మకరంద్రాలు ఉన్నచోటి తేనే తేనెను మార్కట్ చేస్తుంది అటువంటి తేనే మార్కెట్లో కల్తీ అవుతుంది కల్తీ లేని తేనెను గుర్తించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాము స్వచ్ఛమైన తేనే గుర్తించడం ఎలా ; తేనే లో సహజసిద్ధమైన ఔషధగుణాలు కలిగిఉంటాయి ,అందాన్ని ఇముడింపచేయడం తో పాటు అనేక శారీరక రుగ్మతలు నయం చేయగల అద్భుత ఔషధం తేనే . ఐతే అలంటి తేనే ఇప్పుడు కల్తీ భారిన పడుతుంది చిన్నతరహా వ్యాపారుల నుంచి పెద్దతరహ వ్యాపారుల సంస్థలు కూడా స్వచ్చమైన తేనే అందిచలేక పోతున్నాయి అని తాజా అధ్యనాల్ చెప్తున్నాయి మనం రోజు వాడే తేనెలో మోతాదుకు మించి యాంటీ భయోటిక్స్ వాడుతున్నారు అని చెబుతున్నారు ఐతే సింపుల్ ట్రిక్స్ ను వాడి స్వచ్ఛమైన తేనే గుర్తించవచ్చు టిప్ no 1; ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ తేనే వేయండి . ఆ తేనే కనుక వేగంగా నీటిలో కరిగిపోతే అది స్వచ్ఛమైన తేనే కాదని అర్ధం ,అలాకాకుండా తేనే నీటిలో కరిగిపోకుండా గడ్దలుగా ఏర్పడితే అందులో ఎటువంటి కల్తీ జరగలేదు అని అర్ధం టిప్ no 2; కొద్దిగా కాటన్ తీసుకోని దానితో చిన్న ఒత్తి ని తేనెలో ముంచి దానిని వెలిగించండి . ఎటువంటి చిటపటలు లేకుండా ఒత్తి వెలిగితే అది కల్తీ లేని స్వచ్ఛమైన తేనే అని చెప్పవచ్చు . ఎందుకంటే తేనే మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది . చిటపటలాడుతూ వెలిగిన ,అసలు వెలిగాక పోయిన అందులో కల్తీ ఉందని అర్ధం టిప్ no3; ఒక పలచని తెల్లటి వస్త్రం పై తేనే చుక్కలు ను వేయండి . తేనెను గుడ్డ పీల్చుకున్నట్లు ఐతే అది కల్తీ తేనెన్ని అర్ధం . అంతేకాకుండా ఆ వస్త్రాన్ని కడిగినప్పుడు ఎటువంటి మచ్చలు ఏర్పడకుండా ఉంటె అది కల్తీ లేని స్వచ్ఛమైన తేనే అని అర్ధం టిప్ no 4 ; ఒక బ్రెడ్డుపై తేనే పూయండి . తేనే పూసిన బ్రేడ్ కొంచెంగా గట్టిగ మారితే అది స్వచ్ఛమైన తేనే అని చెప్పవచ్చు . అలాకాకుండా బ్రేడ్ తేనెను పీల్చుకుని మెత్తగా మారిపోతే ఆ తేనెలో కల్తీ జరిగింది అని సులభంగా గుర్తించవచ్చు . తేనే స్వచ్ఛమైన మరియు సహజవంతమైన తేలికపాటి వాసనా కలిగి ఉంటుంది అలాకాకుండా పుల్లటి వాసనా లేదా తేనెపై నురగలు ఏర్పడటం మరియు తక్కువ కాలంలో గడ్డకట్టు కు పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి అది నూటికి నూరు శాతం కల్తీ అయింది ని
తేనే వలన ఆరోగ్య ప్రయోజనాలు ; తేనే అనేక రకాల ఉపయోగపడుతుంది మనకు దొరికే తేనే లో అడవి తేనే చాల మంచిది ఎంతో స్వచ్ఛమైనది తేనే బలవర్ధకమైన ఆహారం కూడా తేనే శరీరంలోసూక్ష్మజీవులు ఎదగనివ్వకుండా సంహరిస్తుంది . తేనే లో ఉండే కార్భోహైడ్రాట్స్ లు తక్షణశక్తిని ఇస్తుంది . తేనే రోగనిరోధక శక్తి ని పెంచుతుంది చిన్న చిన్న గాయలుకు చర్మ సంభందిత ఇబ్బందులకు ఇరుగుడుగా క్రమమామ్ తప్పకుండ తీసుకుంటే కోలిస్ట్రాల్ తగ్గుతుంది . తేనే లో కార్భోహైడ్రాట్స్ ,మినరల్స్ ,విటమిన్స్ ,ఉన్నాయి. తేనెలో దాల్చిన చెక్కను కలిపి తీసుకుంటే కీళ్ళ నొప్పులు ,అసిడిటీ భాద తగ్గుతాయి రోజు పావు గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే బరువు తగ్గుతాయి. తేనే లో మిరియాలు పొడి కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది . రెండు చెంచాలు తేనెలో కోడిగుడ్డు లోని తెల్లసొన కొంచెం సెనగపిండి కలిపి ముఖానికి మద్దన చేసుకుంటే చర్మ కాంతి పెరుగుతుంది . ఒకకప్పు వేడి పాలలో చెమ్చాచా తేనే కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమైయి ఆరోగ్యవంతంగా పుష్టిగా ఉంటారు పొడుకునే ముందు గోరువెచ్చని పాలలో తేనే కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది . తేనే ను వేడి పదార్ధాలు కలిపి తీసుకోకూడదు ,తేనెను మరిగించకూడదు ,ఫ్రిజ్జులో ఉంచకూడద్దు పసిపిల్లకు తేనే వాడకూడద్దు ప్రకృతి సంభందితమైన తేనే రుచికే కాదు ఆరోగ్యము అందిచటం లోను ముందు ఉంటుంది. తేనే ను వేసవిలో ఎక్కువ గ తీసుకోకూడదు. రాత్రి పడుకునే ముందు కొద్దిగా తేనే ను తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి . నిద్ర కు ఉపక్రమించే ముందు తేనెను సేవించడం ద్వారా శరీరంలో ఇన్సులిన్ స్థాయి లు మెరుగుపడి ,తద్వారా మెదడులో ట్రిప్టోపాన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది . ఏది నెమ్మదిగా సెరోటోనిన్ గా మార్చబడి మంచి నిద్రను ఇస్తుంది . అలాగే కాలేయం రాత్రి వేళా
యందు గ్లూకోస్ విడుదల చేయడానికి తేనే సేవనం ఎంత గానో సహకరిస్తుంది . ఈ గ్లూకోస్ కొవ్వును కరిగించి హార్మోన్స్ విడుదల కు సహాయపడతుంది . తేనే లో ఉండే ఫ్రక్టోజ్ మరియు గ్లూకోస్ కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది . రాత్రిపూట దగ్గు వలన నిద్ర భంగం కలిగే వారికీ తేనెను తీసుకోవడం ఒక మంచి రెమెడీస్ అని చెప్పవచ్చు . తేనే లో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు దగ్గును తగ్గించడం లో కీలక పాత్ర పోషిస్తాయి . తద్వారా ఎటువంటి అవాంతరాలు లేని గాఢమైన నిద్రను పొందవచ్చు . నిద్ర ఉపక్రమించడం ముందు వెచ్చటి నీటితో గని ,లేదా పాలతో గాని తేనే సేవించడం ద్వారా ,శరీరంలో ని హాని కరమైన టాక్సిల్ ను బయటకు పంపి ,జీర్ణక్రియ సాఫీగా జరిగేలా సహాయ పడుతుంది అలాగే శరీరంలో ని హానికరా భ్యాక్టరియా ను చంపుతుంది తేనే లో ఉండే యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మం ఫై ప్రతికూల ప్రభావాలు కలుగ జేసే బాక్టీరియా నిరుమొళించడం లో సహాయ పడతాయి . తేనే ను సేవించడం వలన ఇందులో ఉండే లక్షణాలు చర్మానికి నిగారింపు తీసుకువస్తాయి . తేనే రక్తం లోని గ్లూకోస్ స్థాయి లులో హెచ్చు తగ్గులు ను నియంత్రిచడం ద్వారా శరీరానికి అవసరమైన ఇన్సులిన్ తేనే ఉత్పత్తి చేయగలుగుతుంది . తద్వారా శరీరానికి మధుమేహ ప్రమాద త్రీవ్రతను తగ్గిస్తుంది . అలాగే తేనే లో ఉండే ఆమ్లజనకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి . తద్వారా అనేక వ్యాధులు రాకుండా అడ్డుకోవడం లేదా ఉన్న వ్యాధులు నివారణలో తేనే ఎంతగానో ఉపయోగపడుతుంది


0 కామెంట్‌లు